పల్లెపోరు.. సర్పంచ్‌గా యూట్యూబర్
TG: యూట్యూబ్‌లో రాణిస్తూ ఓ మహిళ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో హన్మకొండ జిల్లా రంగయ్యపల్లి గ్రామానికి చెందిన రజిత సర్పంచ్‌గా విజయం సాధించారు. ఆమె భర్త మహేష్ గతంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించగా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రజిత 37 ఓట్ల తేడాతో గెలిచారు.