ఆర్టీసీ సమ్మెకు ప్రజా సంఘాల మద్దతు
NGKL: కల్వకుర్తిలో కొనసాగుతున్న RTC సమ్మెకు KVPS, CITU సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. KVPS జిల్లా కార్యదర్శి పరశురాములు మాట్లాడుతూ.. కార్మికుల డిమాండ్లు గొంతెమ్మ కోరికలు కావని, అవి చాలా న్యాయమైనవని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. CITU జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు.