చింతాలమ్మ ఘాట్‌లో ప్రమాదకర మలుపు

చింతాలమ్మ ఘాట్‌లో ప్రమాదకర మలుపు

ASR: చింతాలమ్మ ఘాట్‌లోని మూడో మలుపు ప్రమాదకరంగా మారింది. కృష్ణాదేవిపేట–కాకరపాడు మధ్య జాతీయ రహదారి 516లో ఈ ప్రాంతంలో ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత రెండు నెలల్లో నాలుగు ప్రమాదాలు నమోదయ్యాయి. తక్షణమే అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.