34మంది పేకాటరాయుళ్లకు జరిమానా

34మంది పేకాటరాయుళ్లకు జరిమానా

కాకినాడ: గండేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ చోట్ల జూదం ఆడుతున్న 34 మందిని అరెస్టు చేసినట్లు సీఐ వైఆర్ కే.శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జూదం ఆడుతున్న 34 మందిని శుక్రవారం పెద్దాపురం కోర్టులో హాజరు పరచగా వారికి ఒక్కొక్కరికి రూ.300 చొప్పున రూ.10,200 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.