VIDEO: విద్యార్థులు కొత్త నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: కలెక్టర్
WNP: విద్యార్థులు నిత్యం క్రమశిక్షణ పాటిస్తూ ఏదో ఒక కొత్త నైపుణ్యాన్ని పెంపొందించుకుని, ఉన్నత స్థాయికి చేరి భావితరం విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం పెబ్బేరు మున్సిపాలిటీలోని ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికి కళాశాలలోకి ఆహ్వానించారు.