రైతుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎమ్మెల్యే నిరసన
ADB: రైతుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ నిరసన చేపట్టారు. ఈ నిరసనలో MLC మల్క కొమరయ్య పాల్గొన్నారు. రైతుల నుంచి స్వీకరించిన దాదాపు లక్ష దరఖాస్తులు, వినతిపత్రాలతో బషీరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి గన్ పార్క్ వద్దకు చేరుకొని అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన చేపట్టారు. రైతు భరోసా నిధులు జాప్యం లేకుండా ఇవ్వాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.