జిల్లాలో మరింత పడిపోయిన ఉష్ణోగ్రతలు
అల్లూరి: జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి మరింత పడిపోతున్నాయి. ఇవాళ అరకు ఏజెన్సీలోని దళపతి గూడెంలో 3.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. డుంబ్రిగూడ 3.9, జి.మాడుగుల 3.9, హుకుంపేట 4.6, ముంచింగి పుట్టు 4.8, పాడేరు 4.8, పెదబయలు 6.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన చలితో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఈ నెల 13 వరకు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.