ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష

ELR: నగరంలో ప్రధానమైన డ్రైనేజీ వ్యవస్థను పటిష్టంగా నిర్మించేందుకు అంచనాలు తయారు చేయాలని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ ఏ.భానుప్రతాప్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డ్రైనేజీ మరియు శానిటేషన్ వ్యవస్థను మెరుగుపరిచి ఏలూరు నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.