గర్భిణీలకు వైద్య పరీక్షలు

KMR: సదాశివనగర్ పీహెచ్‌సీలో అమ్మ ఒడి కార్యక్రమం గురువారం నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్. శిరీష తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు తెలిపారు. గర్భిణులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.