'ఇరాన్‌పై దాడులు ఆపాలి'
VSP: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు దురాక్రమణ చర్యలని జిల్లా నూరుబాషా ముస్లిం సంక్షేమ సంఘం నాయకులు విమర్శించారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా షేక్ రహిమాన్,షేక్ నాగూర్ మాట్లాడుతూ.. ఆయిల్ నిక్షేపాల కోసమే అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.