పుస్తక పఠనం వల్ల విద్యార్థులకు మేలు

పుస్తక పఠనం వల్ల విద్యార్థులకు మేలు

VZM: తెర్లాం శాఖ గ్రంధాలయంలో ఆదివారం చదవడం మాకు ఇష్టం కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారి కృష్ణమూర్తి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తక పఠనం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది అన్నారు. విద్యార్థి ప్రతిరోజు ఏదో ఒక పుస్తకం చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కథల పుస్తకాలు, ఇతిహాస గ్రంధాలు, నీతి కథలు, ఆధ్యాత్మిక కథలు చదివించారు.