VIDEO: విద్యార్థినులను ఢీకొన్న లారీ.. తప్పిన ప్రమాదం

VIDEO: విద్యార్థినులను ఢీకొన్న లారీ.. తప్పిన ప్రమాదం

కృష్ణా: మచిలీపట్నం పరాసుపేట సెంటర్ వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఒంటిపూట బడులు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న ముగ్గురు విద్యార్థినులను అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థినులకు ఎటువంటి గాయాలు కాలేదు. కాగా, పరాసుపేట సెంటర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు లేకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.