మద్యానికి బానిసై ఆటో డ్రైవర్ ఆత్మహత్య
SRPT: మద్యపాన వ్యసనం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చివ్వెంల మండల పరిధికి చెందిన ఆటో డ్రైవర్ పడిదల మురళీకృష్ణ(35) మద్యానికి బానిసై పనికి వెళ్లకుండా నిత్యం ఇంట్లో గొడవ పడేవాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై నిన్న రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.