'పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'
JGL: గ్రామాల్లో నిర్వహిస్తున్న పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పెగడపల్లి మండలం సుద్దపల్లి సర్పంచ్ లక్ష్మణ్ పేర్కొన్నారు. మంగళవారం గ్రామంలో మండల పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మండల పశువైద్యాధికారి హేమలతతో కలిసి సర్పంచ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది, పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఉన్నారు.