‘పేట్రియాట్’ ట్రైలర్ రిలీజ్

‘పేట్రియాట్’ ట్రైలర్ రిలీజ్

మలయాళ అగ్ర కథానాయకులు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటిస్తున్న భారీ చిత్రం ‘పేట్రియాట్’. మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఇది తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా మలయాళ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇద్దరు సూపర్ స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.