VIDEO: సంగమేశ్వర స్వామికి స్థిర వాసరే పూజలు

SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. వైశాఖమాసం, శుక్లపక్షం, షష్టి, స్థిర వాసరే పురస్కరించుకొని పార్వతీ సహిత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. ఈ మేరకు సహస్రనామాలతో పూజలు, బిల్వపత్రాలతో బిల్వార్చన, శివ అష్టోత్తర శతనామావళి తదితర కార్యక్రమాలు చేపట్టారు.