లబ్ధిదారునికి CMRF చెక్కు అందజేత

లబ్ధిదారునికి CMRF చెక్కు అందజేత

BHNG: రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన గుండాల దాసుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.31 వేల చెక్కు ఆదివారం అందజేశారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన దాసు, కోలుకుంటున్న సమయంలో సీఎంఆర్ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో ఈ చెక్కును వారి కుటుంబానికి అందించారు.