ఉచిత కంటి శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
NGKL: లింగాల మండల కేంద్రంలో గురువారం అనూష ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సందర్శించారు. మారుమూల ప్రాంతాల్లో పేదలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న జలంధర్ రెడ్డిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.