VIDEO: సిరిసిల్లలో ఘనంగా వినాయక నిమజ్జనం

సిరిసిల్ల కలెక్టరేట్‌లో ప్రతిష్టించిన వినాయకుడిని శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులతో కలిసి ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలని సూచించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఆర్డీవో రాధాబాయి, ఏవో రామిరెడ్డి పాల్గొన్నారు.