యర్రగొండపాలెంలో చిన్నారుల అంత్యక్రియలు పూర్తి

యర్రగొండపాలెంలో చిన్నారుల అంత్యక్రియలు పూర్తి

ప్రకాశం: యర్రగొండపాలెం మండలం బోయలపల్లికి చెందిన వెంకటేశ్వర్లు తన ముగ్గురు పిల్లలను బైక్‌పై తెలంగాణకు తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురు చిన్నారుల మృతదేహాలకు శుక్రవారం తెలంగాణలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారుల తల్లి హాజరుకాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.