పవన్ కళ్యాణ్‌కు అండగా నిలవాలి

పవన్ కళ్యాణ్‌కు అండగా నిలవాలి

మహిళలు, యువకులు జనసేనాని పవన్ కళ్యాణ్‌కు అండగా నిలవాలని ఆ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం తాడేపల్లిగూడెం తన కార్యాలయంలో 11వ వార్డుకు చెందిన 30 మంది యువకులు, మహిళలు జనసేనలో చేరారు. వారిని శ్రీనివాస్ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు జన సైనికులు పాల్గొన్నారు.