జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్కకు వినతి పత్రం

KMR: బాన్సువాడ మండలంలోని పలు గ్రామాల్లో పోడు రైతులు పట్టాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అటవీ అధికారుల చర్యలతో ఆర్థికంగా చితికిపోతున్నారని కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ మండల ప్రధాన కార్యదర్శి సంజీవులు మంత్రి సీతక్కకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మానవతా దృక్పథంతో స్పందించి పోడు పట్టాలిప్పించాలని, భూ భారతి చట్టం కింద న్యాయం చేయాలని కోరారు.