హాకీ గ్రౌండ్ ప్రారంభించిన హోంమంత్రి

హాకీ గ్రౌండ్ ప్రారంభించిన హోంమంత్రి

AKP: నక్కపల్లిలో మినీ హాకీ గ్రౌండ్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రూ.1.6 కోట్ల రూపాయలతో ఈ మినీ హాకీ గ్రౌండ్ నిర్మించబడిందని, మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలని ఉద్దేశంతో ఈ గ్రౌండ్ నిర్మించామని అన్నారు. అనంతరం ఆమె కాసేపు గ్రౌండ్‌లో హాకీని ఆడారు.