డ్రంకెన్ డ్రైవ్ లో ఇద్దరికీ జరిమానా ఒకరికి జైలు శిక్ష
PDPL: రామగుండంలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ముగ్గురిని బుధవారం కోర్టులో హాజరుపరిచినట్లు ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరికి రూ.4,000 జరిమానా, రెండోసారి పట్టుబడిన వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష పడినట్లు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు.