అర్థరాత్రి పారిశుద్ధ్య పనులు పరిశీలన
VSP: అర్ద రాత్రి పారిశుద్ధ్య పనులు చిత్తశుద్ధితో నిర్వహించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన సిరిపురం దత్త్ ఐలాండ్ వద్ద పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతూ.. రాత్రి నిర్వహించే పనులు చిత్తశుద్ధితో నిర్వహించాలన్నారు.