దసరా మహోత్సవ వేడుకల కరపత్రాల ఆవిష్కరణ

SKLM :శివనగర్ కోలనీ, ఆదివారం పేట జంక్షన్ వద్ద శుక్రవారం ఉదయం శ్రీ ఆసిరి తల్లి గ్రామ దేవత అమ్మవారి విజయదశమి మహోత్సవ వేడుకల కరపత్రాలు ఆవిష్కరించారు. అసిరి తల్లి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కమిటీ సభ్యులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చింతు పాపారావు, బుద్దాల వరదరాజు, రావాడ గణపతి, చింతూ పార్వతీశం, తదితరులు పాల్గొన్నారు.