మహాత్మా గాంధీ బస చేసిన ఇల్లు ఇదే

మహాత్మా గాంధీ బస చేసిన ఇల్లు ఇదే

GNTR: స్వాతంత్య్ర ఉద్యమంలో దేశవ్యాప్త పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ తెనాలికి పలుమార్లు విచ్చేశారు. 1933 డిసెంబర్ 23న తెనాలికి వచ్చిన గాంధీజీ ఐతానగర్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ కోదండ రామాలయాన్ని తెరిపించి, హరిజనులతో ఆలయ ప్రవేశం చేయించారు. అక్కడే బహిరంగ సభలో ప్రసంగించగా రూ. 700 విరాళాలు వచ్చాయి. అనంతరం ఐతనగర్‌లోని ఆలపాటి పాపయ్య ఇంట్లో గాంధీజీ బసచేశారు.