పుంగనూరులో పండిట్ దీనదయాళ్ వర్ధంతి
CTR: పుంగనూరు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పండిట్ దీనదయాళ్ వర్ధంతిని పుంగనూరు హై స్కూల్ వీధిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు మాట్లాడుతూ.. దీనదయల్ ఏకాత్మ మానవతా దర్శనం అనే గ్రంథాన్ని భారత ప్రజలకు అందించి దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారని గుర్తు చేశారు.