అన్నదాత సుఖీభవ పండుగ వాతావరణంలో నిర్వహించాలి: కలెక్టర్
ELR: జిల్లాలో ఈరోజు నుంచి 'అన్నదాత సుఖీభవ' కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులను ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతులకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు.