ట్రిపుల్ ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు డాక్టరేట్

KDP: వేంపల్లె మండలం ఆర్జియూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కేతినేని వినోద్ కుమార్‌కు డాక్టరేట్ లభించింది. లోడ్ బాలెన్సింగ్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ పై ఆయన పరిశోధన చేశారు. దీంతో చెన్నైలోని వెల్స్ యూనివర్సిటీ ఈనెల 5న పిహెచ్‌డి పట్టా పొందారు. ఆర్కేవ్యాలీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా అభినందించారు.