ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలి: డీఎస్పీ
VKB: సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తాండూరు డీఎస్పీ యాదయ్య పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని జనగాం, హన్మాపూర్ తదితర గ్రామాలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించరాదని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై శంకర్, తదితరులు ఉన్నారు.