13 తులాల బంగారం చోరీ
RR: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదరూడ జీపీఆర్ ఆర్కిడ్ అపార్ట్‌మెంట్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పనికి వెళ్లిన ఇంటి యజమాని, భార్య తిరిగి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. ఇంట్లోనుంచి 13 తులాల బంగారం, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసారు.