అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ
SDPT: తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ మాధవనేని రఘునందన్ రావు శంకుస్థాపనలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం పోచమ్మ ఆలయం చుట్టూరా ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిక్కుడు చంద్రం, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.