అందుకే ఇరాన్ నౌకలను ముంచేస్తున్నాం: ట్రంప్

అందుకే ఇరాన్ నౌకలను ముంచేస్తున్నాం: ట్రంప్

ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఇప్పటివరకు 5 వేల లక్ష్యాలను ఛేదించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఆ దేశానికి చెందిన 46 అగ్రశ్రేణి నౌకలను యూఎస్ మిలిటరీ ముంచేసిందని తెలిపారు. ఆ నౌకలను అధీనంలోకి తీసుకోవడం కన్నా.. ముంచివేయడమే మంచిదని, చాలా ఆనందాన్ని కలిగించిందని అధికారులు తనతో చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఆ కారణం తనకు కూడా సరైనదిగానే అనిపించిందని చెప్పారు.