VIDEO: యూరియా కోసం జుట్లు పట్టుకొని ఫైట్

MHBD: మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం పంచాయతీ పెట్టుకోవడం. జుట్లు జట్లు పట్టుకొని కొట్టుకోవడం చూసాం కానీ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం యూరియా బస్తాల కోసం ఇద్దరు మహిళలు జుట్లు జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ప్రధాన రహదారిపై పొర్లాడుతూ కొట్టుకోవడం అందర్నీ విస్మయపరిచింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.