రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
కోనసీమ: ఆర్డీఎస్ పనుల కారణంగా అమలాపురం కామనగరువు సబ్‌స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు EE కే. రాంబాబు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కామనగరువు, భట్నవిల్లి, జనుపల్లి, నల్లమిల్లి, సమనస, తాండవపల్లి సహా 13 గ్రామాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు. మరమ్మతు పనులకు వినియోగదారులు సహకరించాలన్నారు.