రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ
TG: సీఎం రేవంత్ రెడ్డితో పలువురు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు జెనీలియా, అక్కినేని అమల కలిశారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తుందని తెలిపారు.