మొండిగేటు నిర్మాణంతో ముంపు సమస్యకు చెక్: ఎమ్మెల్యే

మొండిగేటు నిర్మాణంతో ముంపు సమస్యకు చెక్: ఎమ్మెల్యే

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ మొండిగేటు నిర్మాణంతో గుంటూరులో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. శనివారం భారీ వర్షాల కారణంగా నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించి, ప్రజలకు ధైర్యం చెప్పారు. 24 గంటలూ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా సంప్రదించాలని సూచించారు. నగరంలోని వర్షపు నీరంతా మొండిగేటు ద్వారా గుంటూరు ఛానల్లో కలుస్తుందని పేర్కొన్నారు.