VIDEO: విషాదం.. కరెంట్ షాక్‌తో కార్మికుడు మృతి
WGL: దేశాయిపేటలోని టౌన్ షిప్‌లో విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనులు జరుగుతుండగా ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురైయ్యాడు. ఈ ఘటనలో అతడు ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను విచారిస్తూన్నారు. అయితే మృతిడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.