88వ శాప్ బోర్డు సమావేశం
NTR: విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో ఛైర్మన్ అనిమిని రవి నాయుడు అధ్యక్షతన 88వ శాప్ బోర్డు సమావేశం జరిగింది. సమావేశంలో క్రీడాకారుల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులకు అకాడమీల్లో ప్రవేశం కల్పిస్తామని వివరించారు. సమావేశంలో బోర్డు సభ్యులు పాల్గొన్నారు.