'చిన్నారులకు, గర్భిణీలకు పోషకాహారం అందించాలి'

ADB: అంగన్వాడీకి వచ్చే చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ అన్నారు. సోమవారం ఇచ్చొడ మండలంలోని బొరిగామ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్ వాడి భవనాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను సన్మానించారు. వీరి వెంట మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.