మున్సిపల్ కౌన్సిల్ హాలులో బీఎల్వోల సమావేశం

పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిల్ కాలనీ శుక్రవారం బిఎల్వోలతో ఆర్టీవో కే. చెన్నయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 14వ తేదీ వరకు కొత్తకోటల నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. 85ఏళ్లు నిండిన వృద్ధులకు హోమ్ ఓటింగ్ ఫారాలను అందించాలన్నారు. తహసీల్దార్ మురళీకృష్ణ, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు పాల్గొన్నారు.