ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
NZB: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం సందర్శించారు. సీళ్ల స్థితి, పోలీసు బందోబస్తును క్షుణ్ణంగా పరిశీలించిచారు. అన్ని విధానాలు కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.