లారీ ఢీకొని యువకుడు మృతి
MDK: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధరావత్ సాయికుమార్ అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తూప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన సాయికుమార్ తన స్నేహితులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా, మంగళవారం రాత్రి లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా, సాయికుమార్ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.