వారంలో మూడు రోజులు 'ఎమ్మెల్యే ఆన్ వీల్స్' కార్యక్రమం

SRCL: ప్రతి వారంలో మూడు రోజులు 'ఎమ్మెల్యే ఆన్ వీల్స్' కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువగా ఉంటానని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.