జిల్లాకు నేడు స్కూళ్లకు సెలవు
తిరుపతి జిల్లాపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో తిరుపతి జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు కలెక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం సెలవు ప్రకటించారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచించారు.