బెస్తవారిపేటలోని పలు కిరాణా షాపుల్లో తనిఖీలు

బెస్తవారిపేటలోని పలు కిరాణా షాపుల్లో తనిఖీలు

ప్రకాశం: బెస్తవారిపేటలోని పలు కిరాణా దుకాణాలను సీఐ మల్లికార్జున ఆదివారం పరిశీలించారు. గతంలో అనుమతి లేకుండా బాణాసంచా విక్రయాలు నిర్వహించిన దుకాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా సంబంధిత దుకాణాల యజమానులకు చట్టపరమైన నిబంధనలు వివరించి, అనుమతులు లేకుండా విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.