VIDEO: వైసీపీ హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతోంది: మంత్రి
సత్యసాయి: వైసీపీపై మంత్రి సవిత తీవ్ర విమర్శలు చేశారు. గురువారం తాడేపల్లిలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ అభివృద్ధి దిశగా పనిచేస్తుండగా, వైసీపీ హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సాక్షులను బెదిరించే ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ ఎన్ని చేసినా నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.