పిడుగు పడి వ్యక్తి మృతి

పిడుగు పడి వ్యక్తి మృతి

NLG: పిడుగు పడి వ్యక్తి మృతిచెందిన ఘటన వేములపల్లి మండలం సల్కూనూరు గ్రామంలో చోటుచేసుకుంది. గోపు సుధాకర్ రెడ్డి (63) ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని పొలం వద్దకు వెళ్లగా ఒక్కసారిగా వర్షం పడటంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో భారీశబ్దంతో చెట్టుపై పిడుగు పడడంతో సుధాకర్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు.