రైతులను దగా చేస్తున్న రేవంత్ సర్కార్..

MBNR: అమలు కాని హామీలతో రైతులను దగా చేస్తున్నది రేవంత్ సర్కారే అని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విమర్శించారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ గత తొమ్మిది ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.